చక్రస్నానంతో ముగిసిన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

0 13

తిరుపతి ముచ్చట్లు :

 

అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం చక్రస్నానంతో ముగిశాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వ‌హించారు.ఉద‌యం 8.30 నుండి 10.15 గ‌టంల వ‌ర‌కు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనల‌తో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.కాగా రాత్రి 7 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్  సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్  గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Brahmotsavalu of Sri Prasanna Venkateswara Swami ending with Chakrasnanam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page