నకిలీ నోట్లతో మేకల వ్యాపారి కి టోకరా

0 16

సత్యవేడు ముచ్చట్లు :

మేకలను కొనుగోలు చేసి, నకిలీ నోట్లను అంటగట్టి న ఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. కెవిబిపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటమునిరెడ్డి శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు మార్గంలో ఆటోలో వెళుతున్న దంపతులు రెండు మేకలు కావాలని వెంక టముని రెడ్డిని కోరారు. అందుకు ఆయన అంగీకరించలేదు. తమ వద్ద రెండు వేల రూపాయలు ఉన్నాయని, అది తీసుకొని ఎన్ని మేకలు వ స్తే అన్ని ఇవ్వాలని కోరారు. దీంతో వ్యాపారి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని రెండు మేకపోతులను అప్పగించాడు. వారు మేకలను ఆటోలో వేసుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు.
ఈ లోపు అక్కడికి చేరుకున్న వ్యాపారి మనవడు వారు ఇచ్చింది నకిలీ నోటు అని గుర్తించాడు. అప్పటికే వారు ఉడాయించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Tokara to goat trader with counterfeit notes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page