న్యాక్ ఉద్యోగస్తుల సమస్యలను తీర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతాం- పి .గౌతమ్ రెడ్డి

0 30

తిరుపతి ముచ్చట్లు:

 

 

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) సంస్థ నందు పనిచేస్తున్న ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు న్యాక్ చైర్మన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం విజయవాడలోని ప్రెస్ క్లబ్ నందు న్యాక్ ఉద్యోగస్తుల ప్రథమ మహాసభ జి. శంకరయ్య అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ మహాసభ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాక్ పరిధిని పెంచి ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన మరణానంతరం వచ్చిన ఏ ముఖ్యమంత్రి ఈ సమస్య గురించి పట్టించుకోక పోవడం దారునమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వ్యవస్థని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. రాష్ట్రంలోని కార్మికులు ఉద్యోగస్తులకు కనీస వేతనాలను కల్పించడంలో చాలా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఉద్యోగస్తుని కనీస వేతనం పదివేల రూపాయలు తక్కువ లేకుండా చేయడం జరిగిందని, రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు అప్కస్ అనే సంస్థను ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల అందరినీ ప్రభుత్వ ఆధీనంలోని కి తీసుకోవడం జరిగిందని అన్నారు.

 

 

 

 

- Advertisement -

ఆర్టీసీ కార్పొరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేయాలని అనేక సంవాస్త రాలుగా డిమాండ్ చేస్తున్నా గత ముఖ్య మంత్రి చంద్రబాబు పట్టించు కోలేదని జగన్ సీఎం అయిన వెంటనే ప్రభుత్వం లో విలీనం చేసారని అన్నారు. ఆటో కార్మికులు మొదలు అన్ని వృత్తుల సంఘాలకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్య కార్మికులకు కూడా నెలకు 16 వేల రూపాయల జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. న్యాక్ సంస్థ ఈ రాష్ట్రంలో ఉన్నదని చాలామందికి తెలియలేదని, న్యాక్ సంస్థ నందు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిర్మాణరంగం నందు అనుభవంతో పాటు టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అర్హత కలిగిన 250 మంది గత ఇరవై మూడు సంవత్సరాలుగా పని చేస్తున్న గత ప్రభుత్వాలు ఉద్యోగ భద్రతను కల్పించక పోవడం శోచనీయం. సీనియారిటీ దృష్టిలో ఉంచుకొని వారికి ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన పిఆర్సి,టైం స్కేల్,సమాన పనికి సమాన వేతనం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

 

 

 

 

 

అనంతరం వై ఎస్ ఆర్ టి యు సి రాష్ట్ర నాయకులు ఎన్. రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత న్యాక్ సంస్థ ను పట్టించుకున్న వారే లేరని 10వ షెడ్యూల్లో ఉన్నప్పటికీ సంస్థకు రావాల్సిన నిధులు లేకపోవడం వలన మరియు సరైన యాజమాన్యం లేకపోవడం వల్ల సంస్థలో పనిచేసే సిబ్బంది చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విభజన జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటివరకు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ కానీ సంస్థ అభివృద్ధి సంబంధించి ఏ ఒక్క నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోకపోవడం శోచనీయమన్నారు. వీరిని రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం మీద వీరికి జీతాల కోసం ఎలాంటి ఆధార పడవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో జరిగే నిర్మాణాల నుండి సేకరించే సెస్ ద్వారా సంస్థ అభివృద్ధికి 0.01 శాతం వస్తుందని అయినా సంస్థ అభివృద్ధికి మరియు ఉద్యోగస్తుల ఉద్యోగస్తులకు ఎలాంటి మేలు జరగలేదు. గతంలో ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి లో ఈ న్యాక్ సంస్థలను విలీనం చేస్తానని ప్రతిపాదన వచ్చిన ఎలాంటి విలీనం జరగలేదు. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో కలిగినప్పటికీ అనేది ఒక ప్రైవేటు శిక్షణా సంస్థ గా ఉండిపోవాల్సి వస్తుంది కానీ ఉమ్మడి రాష్ట్రంలో గాని లేదా తెలంగాణలో ఉన్న న్యాక్ లా అభివృద్ధి చేయకుండా అభివృద్ధికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత న్యాక్ సంస్థకు సంపూర్ణ స్థితిలో ఒక ఐఏఎస్ ను నియమించుకోవడం కూడా ప్రస్తుత పరిస్థితి ఒక కారణం అని అన్నారు.

 

 

 

ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ టి యు సి కృష్ణా జిల్లా అధ్యక్షుడు ప్రదీప్, వై ఎస్ ఆర్ టి యు సి మైనారిటీ విభాగ కార్యదర్శి రూరుళ్ల మరియు న్యాక్ సిబ్బంది జి.శంకర్, సుధాకర్, కిరణ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం న్యాక్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ యూనియన్ (న్యూ) రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. * గౌరవా అధ్యక్షులు గా ఎన్. రాజా రెడ్డి ( వై ఎస్ ఆర్ టీ యు సీ)అధ్యక్షుడు జి శంకరయ్య (కడప),వైస్ ప్రెసిడెంట్ గా ఎం వసంతరావు (వెస్ట్ గోదావరి), జి ఎస్ నారాయణ రెడ్డి (చిత్తూరు), ఈ ఎస్ శ్యామ్ బాబు (గుంటూరు), చంద్రశేఖర్ (కర్నూల్), ప్రధాన కార్యదర్శిగా ఎం సుధాకర్ (విజయ నగరం), సహాయ కార్యదర్శులు గా డి.టి రాజా బాబు (శ్రీకాకుళం), టి.సురేష్ బాబు (ప్రకాశం), వి బి పి విజయలక్ష్మి (వెస్ట్ గోదావరి), ఎస్ సుధాకర్ (అనంతపురం)
కోశాధికారిగా డి కిరణ్ కుమార్ రెడ్డి (చిత్తూరు) మరియు 21 మంది కమిటీ మెంబర్ లను ఏకగ్రీవంగా గా ఎన్నుకోవడం జరిగింది.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: We will bring it to the notice of the Chief Minister to solve the problems of NAC employees – P. Gautam Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page