పుంగనూరులో కరోనాను నియంత్రించేందుకు చర్యలు -చైర్మన్‌ అలీమ్‌బాషా

0 210

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో కరోనా వ్యాప్తిని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అనేక రకాల చర్యలు చేపట్టినట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. ఆదివారం ఆయన పట్టణంలోని 31 వార్డుల్లోను హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. కరోనాను నియంత్రించేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, ఫాగింగ్‌ చేస్తున్నామన్నారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు  ధరించాలని, భౌతికదూరం పాటించాలని చైర్మన్‌ కోరారు. అలాగే ఇంటింటికి వలంటీర్లు, మహిళా ప్రతినిధులు , మున్సిపల్‌ సిబ్బంది వెళ్లి అవగాహన కల్పిస్తూ , మైకుల్లో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచేలా పకడ్భంధిగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Measures to control the corona in Punganur -Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page