ప్రముఖ జ్యోతిష్య పండితుడు జ్ఞానచక్రవర్తి మృతి

0 288

– ప్రముఖుల సంతాపం

 

 

పుంగనూరు ముచ్చట్లు:

 

 

- Advertisement -

పుంగనూరు పట్టణానికి చెందిన వెల్లలా సత్యనారాయణ (81) అనే జ్ఞానచక్రవర్తి కరోనా వ్యాదితో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందారు. బెంగళూరులో నివాసం ఉన్న జ్ఞానచక్రవర్తి బహుబాషాకోవిదుడుగా , ప్రముఖ జ్యోతిష్యాస్త్ర పండితుడిగా పేరుగాంచి, ఎంతో మంది ప్రముఖులు ఈయనకు సన్నిహితులైయ్యారు. ఇలా ఉండగా గత నెల రోజులుగా కరోనా వ్యాధితో బాధపడుతూ వైదేహి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను బెంగళూరులో నిర్వహించారు. ఈయన మృతి పట్ల మాజీ ప్రధాని దేవేగౌడ , మాజీ ముఖ్యమంత్రి సురేష్‌గౌడ, రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి, మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు సంతాపం తెలిపారు. కర్నాటక మంత్రి యోగేశ్వర్‌, పారిశ్రామికవేత్త డి.ఏ.శ్రీనివాస్‌, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తదితరులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. సత్యనారాయణ 14వ యేటా మైసూర్‌ మహరాజులు ఈయన తెలివితేటలను గుర్తించి జ్ఞానచక్రవర్తి అనే బిరుదును ప్రధానం చేశారు. ఆనాటి నుంచి జ్ఞానచక్రవర్తిగా ప్రసిద్దిగాంచారు.శృంగేరి, కంచి, దత్త, పీఠాధిపతులు ఈయనను సన్మానించారు. ఈ విధంగా అనేక సంస్థలు, ఈయనను పలుమార్లు సత్కరించారు. ఈయన బ్రహ్మచారి. కాగా జ్ఞానచక్రవర్తికి చెందిన వేలాది గ్రంధాలను, డిఏ ట్రస్ట్ వారు వారి ఆధ్వర్యంలో లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

   

 

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: The famous astrologer Jnanachakravarti died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page