అగ్ని-ప్రైమ్ క్షిప‌ణిని ప‌రీక్షి విజ‌య‌వంతం

0 16

భువ‌నేశ్వ‌ర్   ముచ్చట్లు :

అణ్వాయుధ సామ‌ర్థ్యం క‌లిగిన అగ్ని-ప్రైమ్ క్షిప‌ణిని ఇవాళ భార‌త్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. అగ్ని మిస్సైల్ సిరీస్‌లో భాగ‌మైన అగ్ని ప్రైమ్‌ను ఇవాళ ఉద‌యం 10.55 నిమిషాల‌కు ఒడిశా తీరంలో ప‌రీక్షించారు. చాందీపూర్‌లోని నాలుగ‌వ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్ర‌యోగించారు. అగ్ని ప్రైమ ఓ షార్ట్ రేంజ్ బ‌లాస్టిక్ మిస్సైల్‌. అది వెయ్యి నుంచి 1500 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించ‌గ‌ల‌దు. దీంట్లో ఎన్నో అడ్వాన్స్ ఫీచ‌ర్లు ఉన్నాయి.సుమారు వెయ్యి కిలోల పేలోడ్‌ను ఈ మిస్సైల్ మోసుకెళ్ల‌గ‌ల‌దు. దీనికి అణ్వాయు సామ‌ర్థ్యం కూడా ఉన్న‌ది. అగ్ని-1 సింగిల్ స్టేజ్ మిస్సైల్ కాగా.. అగ్ని ప్రైమ్‌లో రెండు స్టేజీలు ఉన్నాయి. కొత్త టెక్నాల‌జీతో అగ్ని ప్రైమ్ క్షిప‌ణిని నిర్మించారు. దీంతో దీని బ‌రువు గ‌త అగ్ని వ‌ర్ష‌న్ల‌తో పోలిస్తే త‌క్కువ‌గా ఉంటుంది. అగ్ని-4, అగ్ని5 మిస్సైళ్ల‌లో ఉన్న టెక్నాల‌జీ క‌న్నా తేలిక‌గా అగ్ని ప్రైమ్ ఉంద‌న్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Successful test of Agni-Prime missile

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page