అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

0 56

హైదరాబాద్ ముచ్చట్లు :

- Advertisement -

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది,కరోనాతో మృతి చెందింది అని చెప్పిన భర్త  హుటాహుటిన భార్య మృతదేహానికి అంత్యక్రియలు చేసేసాడు అక్కడే అనుమానం వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు  తాముకుడా అంత్యక్రియలలో పాల్గొన్నామని తెలిసి కరోన టెస్ట్ చేయించుకోగా అందరికి నెగటివ్ వచ్చింది. దీనితో తమ కూతురుని అల్లుడు విజయ్ ఎదో చేసి చంపి ఉంటాడని అనుమానం కలిగింది దీనితో వెంటనే వనస్థలిపురం పోలీసులని ఆశ్రయించారు మృతురాలు కవిత తల్లిదండ్రులు విజయ్ సొంత ఊరు నల్గొండ జిల్ మిర్యాలగూడ పి ఏ పెల్లి మండలం పిల్లగుంట్ల తండా ఇతనికి మూడు సంవత్సరాల క్రితం కవిత తో వివాహం జరిగింది. తరువాత కొద్దిరోజులకి కవిత విజయ్ లు హైదరాబాద్ లోని ఇంజపూర్ గ్రామం సుందరయ్య కాలనీకి మకాం మార్చారు ఈ మధ్యకాలంలో విజయ్ కి వేరే అమ్మాయి తో సంబంధ0 ఉందని తెలిసి బార్య భర్తల మధ్య గొడవ స్టార్ట్ అయింది అయితే ఈ నెల 10 న వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి కవితని తెలుకుని వెళ్లిన విజయ్ భార్యకి కరోన పాజిటివ్ వచ్చిందని కవిత తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చాడు 17 వే తేదీన కవిత తండ్రి వచ్చి ఆమెకి పండ్లు కూడా ఇచ్చి వెళ్లగా మరుసటి రోజే కరోనతో కవిత మృతి చెందిందని తన అత్తమామలకి సమాచారాన్ని ఇచ్చి తన సొంత ఊరు కి వెళ్లి అంత్యక్రియలు చేయటం జరిగింది అయితే కరోన తో మృతి చెందిన వ్యక్తి కి మృతదేహం ప్యాకింగ్ కూడా వేరేలాగా ఉండటం తో ఇతను తప్పు చేసాడని తమ కూతురిని విజయ్ చంపి కరోన తో మృతి చెందినట్లు నమ్మబలికాడని ఆరోపిస్తున్నారు దీనితో రంగం లోకి దిగిన పోలీస్ లు అక్కడి స్దానిక ఎమ్ ఆర్ ఓ సమక్షంలో రీ పోస్ట్ మార్టం నిర్వహించారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Married died under suspicious circumstances

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page