కర్ఫ్యూ సడలింపులు

0 27

విజయవాడ  ముచ్చట్లు :
కరోనా కట్టడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.జూలై 1వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా.. రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కంటే ఎక్కువ ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగుతాయని తెలిపారు.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత కట్టుదిట్టమైన కర్ఫ్యూ అమలవుతుందని అన్నారు. కొత్త ఆంక్షలు జూలై 1 నుంచి 7 వరకు అమల్లో ఉండనున్నాయి.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Curfew relaxations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page