క్షణికావేశంలో తల్లీ ఆత్మహత్య

సూర్యాపేట  ముచ్చట్లు :
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, భర్త తన మాట వినకుండా పంచాయతీకి వెళ్లాడని.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆ కుటుంబంలో విషాదం నింపింది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. మౌనిక (28)కు చివ్వెంల మండలం అక్కలదేవిగూడేనికి చెందిన శ్రీనాథ్తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వీరు నడిగూడెం మండలం రామాపురంలో ఓ అద్దె ఇంట్లో ఉంటు ఆర్ఎంపి వైద్యుడు గా పని చేస్తున్నారు. దంపతులకు మూడేళ్ల చిన్నారి లాక్షిత (3), తొమ్మిది నెలల బాలుడు వున్నారు. తల్లి క్షణికావేశంతో ముక్కుపచ్చలారని చిన్నారుల ఉసురు తీసిందని స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్సై ఏడుకొండలు ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Mother commits suicide in a flash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *