కేసీఆర్ బ్రహ్మస్త్రం అక్కరకు వస్తుందా

0 14

హైద్రాబాద్  ముచ్చట్లు :

రాజకీయాల్లో ప్రత్యర్థులపై కేసుల అస్త్రాలను అధికారపార్టీలు గా ఉండేవారు అవసరాన్ని బట్టి బయటకు తీస్తారు. ప్రజల్లో వారిని పలుచన చేసి పైచేయి సాధిస్తారు. ఇది ఇందిరాగాంధీ హయం నుంచి ఈ ట్రెండ్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొనసాగుతూ వస్తూనే ఉంది. జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్రస్థాయిలోనూ కీలకమైన కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించదు. అయితే రాజకీయంగా తమకు అవసరం అనుకున్నప్పుడు వాటినే బ్రహ్మాస్త్రాలుగా వినియోగిస్తారు అధికారంలో ఉన్నవారు. ఇప్పుడు కేసీఆర్ తన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది చర్చనీయం కాబోతుంది.విభజన తరువాత భాగ్యనగర్ నుంచే ఆంధ్రప్రదేశ్ పాలన కూడా సాగుతున్న రోజుల్లో సొంత బలం లేకపోయినా ఎమ్యెల్సీ ఎన్నికల్లో గెలవాలన్న కక్కుర్తితో నాటి సిఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా నామినేటెడ్ ఎమ్యెల్సీ స్టీఫెన్సెన్ కి బేరం పెట్టించారు. అప్పటికే చంద్రబాబు అండ్ టీం పై గట్టి నిఘా కొనసాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్ హ్యాండెడ్ గా స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ బండారాన్ని కెమెరాల్లో బంధించి మరీ ప్రజల ముందు పెట్టి బాబు అండ్ టీం బట్టలు విప్పేశారు. ఈ వివాదం ఓటుకు నోటు కేసు గా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్ట్టించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు వారి బృందాలు మీడియా వేదికగా తలపడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్ట్టించారు. చంద్రబాబు సైతం టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా సంభాషణలను రికార్డ్ చేశారంటూ ఎదురు కేసు పెట్టారు. ఓటుకు నోటు కేసు తెలంగాణ లో కదలిక వచ్చినప్పుడల్లా ఎపి లో కౌంటర్ కేసు లో విచారణ అంటూ హడావిడి చేసేవారు. ఆ తరువాత దీన్ని కొందరు హస్తిన పెద్దలు రాజీ చేయడంతో షరతుల్లో భాగంగా ఉన్న ఫలంగా హైదరాబాద్ విడిచి చంద్రబాబు అమరావతి చేరుకున్నారన్నది అంతా నమ్మే అంశం. అయితే ఈ కేసులో బ్రహ్మ దేవుడు వచ్చినా చంద్రబాబును కాపాడలేడు అంటూ కేసీఆర్ బహిరంగ సభల్లో పదేపదే ప్రకటించి ఆ తరువాత కట్ చేస్తే కేసు ను అతి గతి లేకుండా అటకెక్కించారు.

 

- Advertisement -

ఆ కేసు తరువాత రేవంత్ రెడ్డి టిడిపి కి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరాక ఓటుకు నోటు కేసు లో కొంత చలనం ఏర్పడింది. చంద్రబాబు ఆశీస్సులతోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారన్న ప్రచారం సాగింది. అయితే ఆ తరువాత ఈ కేసు చార్జిషీట్ లో చంద్రబాబు ప్రస్తావనే లేకుండానే వ్యవహారం నడిచింది. దాంతో దీనిపై అనేక విమర్శలు, ఆరోపణలు వినిపించాయి. రేవంత్ రెడ్డి చుట్టూనే కథ ఓటుకు నోటు కేసులో సాగింది. ఇప్పుడు తెలంగాణ పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించేసింది. దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరైన రేవంత్ రెడ్డి స్పీడ్ కి కళ్లెం వేయాలంటే ఇప్పుడు గులాబీ బాస్ చేతిలో పాత కేసు ఆయుధంగా సిద్ధంగానే ఉంది. ఈ నేపథ్యంలో పాత కేసు ను వేగవంతంగా కోర్టు లో కేసును నడిపేందుకు రంగం సిద్ధం చేస్తారని విశ్లేషకులు అంచనా. కేసీఆర్ మాటల మాంత్రికుడు లా ఎలాంటి రాజకీయాలు వ్యూహాలు సాగిస్తారో అంతే స్థాయిలో రేవంత్ రెడ్డి సైతం ధీటుగా పోరాటం చేసే సత్తా ఉన్న నేత. ఈ నేపథ్యంలో టార్గెట్ రేవంత్ గా కేసీఆర్ ఓటుకు నోటు కేసు ను బాగా వాడుకుంటారని దాంతో తెలంగాణ రాజకీయాలు రాబోయే రోజుల్లో వాడిగా వేడిగా సాగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కొత్త టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Does KCR Brahmastra come to Akkara?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page