టీబీతో బాధవుడుతున్న నిరుపేదను ఆదుకుందాం..!       – ఆర్ధిక సహాయం చేసిన మద్దెల దినేష్, ఆనురాజ్

0 13

పెద్దపల్లి  ముచ్చట్లు :

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన పొగుల సంపత్ అనే నిరుపేద వ్యక్తి, ఇబ్బందుల్లో ఉన్నారని సీనియర్ జర్నలిస్ట్ వాసు తెలియజేయడం జరిగింది. మానవత దృక్పధంతో స్పందించి  సామాజిక కార్యకర్తలు మద్దెల దినేష్, అనురాజ్, మండల శ్రీనివాస్ స్పందించి ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. అనంతరం నిరుపేద అయిన సంపత్ కుటుంబ  లాండ్రీ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితం టీబీ వ్యాధికి గురైన సంపత్, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపధ్యంలోనే రెండు రోజుల క్రితం ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. వరంగల్ లోని టీబీ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తీసుకుపోవాలని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సూచించారు. వరంగల్ తరలించడానికి డబ్బులు లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నారు. 108 అంబులెన్స్ కూడా వరంగల్ వరకు రాలేమని చెబుతున్నారు. అంబులెన్స్ కు డబ్బులు సమకూర్చుకోలేని దినస్థిస్తిలో తల్లడిల్లుతున్న ఈ కుటుంభాన్ని ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Let’s help the poor who are suffering from tuberculosis ..!
– Maddela Dinesh, Anuraj who provided financial assistance

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page