తేనెటీగల దాడిలో గాయపడ్డ సర్పంచ్ శోభారాణి

0 17

జగిత్యాల ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సర్పంచ్
పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల ముచ్చట్లు :
పల్లెప్రగతి కార్యక్రమంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన తేనెటిగలు సర్పంచ్ తాటిపర్తి శోభారానిపై దాడిచేయడంతో తీవ్రగాయాలయ్యాయి.బతికే పెళ్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్డుకిరువైపులా 3 ట్రాక్టర్లు , జెసిబి లతో  చదును చేస్తుండగా గ్రామ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి పై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఎటు పాలుపోలేని  స్థితిలో  ఆమే కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వెంబడించి దాడి చేయడంతో అశ్వస్తతకు గురయ్యారు. దీంతో  సర్పంచ్   తల, మొఖం, చేతులకు గాయాలు కాగా స్థానికులు శోభారాణిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.
జగిత్యాల ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు తేనెటిగల  ముళ్లను తీసివేయడంతో, ఆసుపత్రిలో చికిత్సపాందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి శోభారాణిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ రామకృష్ణ తో మాట్లాడారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Sarpanch Shobharani injured in bee attack

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page