దొంగగా మారిన నేవి ఉద్యోగి

0 30

పాట్నా    ముచ్చట్లు :
అతడు దేశ రక్షణ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కానీ ఉమ్మడి కుటుంబం, ప్రేమ వివాహంతో పాటు, షేర్ మార్కెట్ అలవాటు అతడిని తప్పుడు మార్గం వైపు పయనించేలా చేశాయి. పర్యవసానంగా ఓ జ్యుయెల్లరీ షాపులో చోరీకి పాల్పడ్డా డు. పెళ్లినాడు భర్త అడుగుజాడల్లో నడుస్తానని చేసిన ప్రమాణాన్ని పాటిస్తూ భార్య కూడా అతడికి సహకరించింది. చివరికి పథకం బెడిసికొట్టి దంపతులిద్దరూ పోలీసులకు చిక్కారు.బీహార్‌కు చెందిన రాజేష్ ఇండియన్ నేవీలో సైలర్‌గా పనిచేస్తూ విశాఖపట్నంలో నివాసముంటున్నాడు. అమ్రిత పూనమ్ అనే యువతిని ప్రేమించి కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రాజేష్ కుటుంబం చాలా పెద్దది. తల్లిదండ్రులకు అతడితో కలిసి ఏడుగురు సంతానం. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు, కుటుంబ పోషణ అంతా అతడి మీదే పడటంతో సుమారు రూ.10లక్షల వరకు అప్పులయ్యాయి. దీనికి తోడు షేర్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మరింత నష్టపోయాడు. ఈ క్రమంలోనే అతడికి విశాఖ నుంచి ముంబైకి బదిలీ అయింది.ఈ నేపథ్యంలోనే అప్పుల బాధ తప్పించుకునేందుకు రాజేష్ తన భార్యతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. గోపాలపట్నం సమీపంలో ఉన్న శ్రీ జ్యుయెల్లరీ షాపులో చోరీకి పాల్పడ్డాడు. 4.50 కిలోల వెండితో పాటు 90 వేల నగదు, మరికొన్ని బంగారు నగలు చోరీ చేశాడు. దోచుకున్న సొత్తును ఇంటికి తీసుకెళ్లకుండా ఎయిర్‌పోర్ట్ సమీపంలోని పొదల్లో దాచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా రాజేష్, అతడి భార్యే సూత్రధారులను తేల్చి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:Navy employee turned thief

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page