నిబంధనలు పాటించకుంటే కఠినచర్యలు

0 14

-ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాలకు హెచ్చరిక

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులని ఫీజుల విషయం లో ఇబ్బందులకు గురిచేస్తూ ప్రభుత్వ నిబంధలని పాటించకుంటే కఠినచర్యలు ఉంటాయని డి ఈ ఓ సుశీందర్ రావు హెచ్చరించారు. ఎల్ బి నగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్ ఎల్ ఏ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్ లోని కమ్యూనిటి హాల్ లో ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ లతో  ఏర్పాటు చేసిన సమావేశం లో రంగారెడ్డి జిల్లా మరీయ్ మండల విద్యా శాఖ అధికారులు పాల్గొనటం జరిగింది, ఈ సందర్భంగా ఎమ్ ఎల్ ఏ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి ప్రైవేట్,  కార్పొరేట్ స్కూల్ ల యాజమాన్యం ఫీజుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మొరపెట్టుకోవడం తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని,గత సంవత్సరం స్కూల్ ఫీస్ కట్టలేదని ఇప్పుడు కట్టాలని లేదంటే ఆన్లైన్ లింక్ ఇవ్వమంటూ వేధిస్తున్నారని తెలిపారు ఇక నుండి ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు . డీఈఓ  మాట్లాడుతూ పుస్తకాలు,మరియూ ఇతర వాటి పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులని ఇబ్బందులకు గురిచేస్తే తమకి సమాచారాన్ని ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిదంగా జీఓ 46 లో ఉన్న అంశాల ఆధారంగా అన్ని స్కూల్ ల యాజమాన్యం పాటించాలని లేనిపట్ల చర్యలు తప్పవని అన్నారు

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Strict measures if rules are not followed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page