పిర్యాదుదారులతో స్నేహితుల్లా వుండాలి

0 12

ఖమ్మంముచ్చట్లు :

పోలీస్ సిబ్బంది ఫిర్యాదుదారుల పట్ల  స్నేహ భావంతో మెలగాలని  డీజీపీ మహేందర్ రెడ్డి  కోరారు.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను డీజీపీ మహేందర్రెడ్డి  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.  ఈ సందర్బంగా  పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి  స్టేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు  పోలీసులు ప్రజలతో స్నేహ భావంతో మెలిగి  పిటిషన్ దారులకు  న్యాయం చేయాలని ఆయన కోరారు.  స్టేషన్ కు వచ్చే ప్రతి పౌరుడిని గౌరవించాలని  ఆయన కోరారు.  పోలీసులు నిర్వర్తించే  విధివిధానాలపై  సిబ్బందిని పలు విధాలుగా ప్రశ్నించారు.  పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన కోరారు  విధుల పట్ల అలసత్వం వహించకుండా ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు.  శాంతి భద్రతల విషయంలో ఎలర్ట్ గా ఉండాలని ఏసీపీ సత్యనారాయణ సీఐ వసంత్కుమార్ ను కోరారు.  ఆయన వెంట సీపీ  వారియర్, అడిషనల్ సీపీలు, ఏఎస్పీ సత్యనారాయణ సీఐ వసంత్ కుమార్,  ఎస్సైరవి  సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Must be friends with complainants

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page