పీవీ సంస్కరణలే దేశాన్ని కాపాడాయి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

0 11

జగిత్యాల ముచ్చట్లు :

తెలంగాణ పీవీ సంస్కరణలే దేశాన్ని కాపాడాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం నాడు పట్టణంలోని మోతె రోడ్డులోని తెరాస పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని  పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహించగా, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,  జెడ్పి ఛైర్పర్సన్ దావా.వసంత సురేష్ , మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ.శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ పివి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం అధకారంలో ఉందని, ఉన్నప్పటికి బంగారం నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితి తనకు మాత్రమే సాధ్యమైన దేశాన్ని కాపాడి, ఆర్థిక రంగంలో మరింత ముందుకు నడిపించిన ధీరుడాయన, అంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కీర్తించారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్, దేశాభివృద్ధి కోసం పీవీ అందించిన సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయని అన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకి దేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్న ఇవ్వాలని అన్నారు. దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా పీవీ ప్రధాని పదవి చేపట్టారన్నారు. పీవీ సేవలను యువతరానికి తెలియజేసేల రాష్ట్ర వ్యాప్తంగా శతజయంతి కార్యక్రమాలు నిర్వహించి ముగింపు కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, రూరల్ ఎంపిపి పలేపు రాజేంద్రప్రసాద్, అర్బన్ వైస్ ఎంపిపి ములసపు లక్ష్మీ, జెడ్పిటిసి మహేష్, మనోహర్ రెడ్డి, ఏ యం సి చైర్మన్ దామోదర్ రావు, ప్యాక్స్ చైర్మన్లు, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, టిఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ కార్యదర్శి కస్తూరి శ్రీ మంజరి, నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:It was the PV reforms that saved the country
MLA Dr. Sanjay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page