భాగ్యనగరం.. విశ్వనగరం అవుతోంది

0 37

హైదరాబాద్  ముచ్చట్లు :
భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. న‌గ‌రాలు అన్నివిధాలుగా అభివృద్ధి చెందాలంటే ర‌హ‌దారులు ముఖ్యమని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన లింక్ రోడ్లను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం అన్ని వైపులా విస్తరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో స‌ర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల కల్పనలోనూ దూసుకుపోతున్నామన్నారు. హైద‌రాబాద్ పెరుగుతున్న జ‌నాభాను దృష్టిలో ఉంచుకుని ఇందుకు అనుగుణంగా నిర్మాణ రంగంతో పాటు ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.ఇప్పటికే నగరంలో 16 లింక్ రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్న మంత్రి.. కొత్త సైబర్ సిటీని అన్ని ప్రాంతాలకు కలుపుతూ కొత్త నిర్మించామన్నారు. దీని ద్వారా కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం నుంచి నోవాటెల్ గేట్ వరకు, మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మజీద్ వరకు, వసంత సిటీ నుంచి న్యాక్, జేవీజీ హిల్స్ నుంచి మజీద్ బండ వరకు కొత్తగా రహదారులను లింక్ చేశామన్నారు. వీటి ద్వారా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ బాగా తగ్గుతుందన్న మంత్రి.. దశలవారీగా మరిన్ని లింక్ రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఎస్ఆర్డీపీలో భాగంగా వంతెన‌లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నామని అని మంత్రి తెలిపారు. రూ. 6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఎస్ఆర్డీపీతో పాటు సీఆర్ఎంపీ కింద రూ. 1800 కోట్లతో ప‌లు అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. వీటితో అద‌నంగా హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కింద మొద‌టి ద‌శ‌లో రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామ‌ని తెలిపారు. ఇవాళ ప్రారంభించుకున్న 5 లింక్ రోడ్ల నిర్మాణం రూ. 27.43 కోట్ల వ్యయంతో చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. రెండో ద‌శ‌లో రూ. 65 కోట్లతో నాలుగు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అద‌నంగా రూ. 230 కోట్లతో మ‌రో 13 రోడ్లను అభివృద్ధి చేస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రింత పార‌ద‌ర్శకంగా రోడ్ల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. ట్రాఫిక్, ప్రయాణ దూరం త‌గ్గించేలా లింక్ రోడ్లను పూర్తి చేస్తున్నామ‌ని కేటీఆర్ స్పష్టం చేశారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:Fortune city .. becoming a cosmopolitan city

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page