మెగా హౌసింగ్‌ గ్రౌండిగ్‌ మేళాను విజయవంతం చేయండి

0 35

చౌడేపల్లె ముచ్చట్లు:

 

జూలై 1,3,4 వతేదీలలో నిర్వహించాల్సిన మెగా హౌసింగ్‌ గ్రౌండిగ్‌ మేళాను విజయవంతం చేయాలని( ఏఐపీపీ) ఆల్‌ ఇండియా పంచాయతీ పరిషత్‌ మెంబరు అంజిబాబు అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులతో సమావేశం జరిగింది. మండలంలో 2139 మందికి పక్కా గృహాలను మంజూరు చేసి , వారికి అధికారులు స్వాధీన పత్రాలను అందజేశారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండ్ల నిర్మాణపనులను వెహోదలవ్వడానికి ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిథులు, సచివాలయ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో వెహోదలెట్టి త్వరగా పూర్తిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, మండలపార్టీ అధ్యక్షుడు రామమూర్తి, సింగిల్‌విండో చైర్‌పర్సన్‌ రవిచంద్రారెడ్డి, ఎంపీడీఓ శంకరయ్య, ఎంపీటీసీ నరసింహులు యాదవ్‌ తదితరులున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Make the Mega Housing Grounding Fair a success

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page