హౌసింగ్ నిర్మాణాన్ని వేగవంతం చేయండి

0 174

రామసముద్రం ముచ్చట్లు:

 

హౌసింగ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి సిబ్బందికి, వాలింటర్లకు సూచించారు. సోమవారం స్థానిక సచివాలయంలో ప్రత్యేకాధికారి హరినాథరెడ్డి ఆధ్వర్యంలో గృహ నిర్మాణ పథకంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాన్ని అర్హులైన పేదలకు అందజేయాల్సిన బాధ్యత వాలింటర్లుపై ఉందని సూచించారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశాల మేరకు జూలై 1వ తేదీ నుంచి ఖచ్చితంగా ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. నిర్మాణ దశను బట్టి బిల్లులు చెల్లిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, వీఆర్వో శ్రీనివాసులు, ఉప సర్పంచ్ ఇంద్రాణమ్మ, సిబ్బంది భారతమ్మ, ఉపేంద్ర, బత్తెమ్మ, గౌతమి, రేణుక, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, ఎల్. మునస్వామి, జయచంద్ర, శివకుమార్, వాలింటర్లు మేఘన, రెడ్డెమ్మ, పుష్పావతి, దినకర్, వెంకటరమణ, ప్రదీప్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Accelerate housing construction

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page