అండగా ఉంటాం… ఆదుకుంటాం- మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా

0 157

రామసముద్రం ముచ్చట్లు:

 

కరోనతో మృతి చెందిన మణి కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటూ… ఆదుకుంటామని మంగళవారం మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా భరోసా ఇచ్చారు. కెసిపల్లి పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి గ్రామానికి చెందిన వాలింటర్ కుమారస్వామి తండ్రి మణికు గత 15 రోజుల క్రితం కరోన పాజిటివ్ వచ్చింది. దింతో ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రూయకు రెఫర్ చేశారు. రుయాలో చికిత్స పొందుతూ ఈ నెల 22వ తేదీన మృతి చెందాడు. మృతుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే నవాజ్ భాషకు తెలియడంతో ఆయన మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చేలా చేస్తానని, మీరు అధైర్య చెందకుండా ఉండాలని, మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కెసిపల్లి సచివాలయాన్ని సందర్శించి ప్రభుత్వం అమలు చేసిన జగనన్న గృహ నిర్మాణంపై ఆరా తీశారు. జూలై 1వ తేదీ నుంచి ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ కేశవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, వీఆర్వో శ్రీనివాసులు, ఏఎన్ఏం సుగుణమ్మ, నాయకులు సిహెచ్.రామచంద్రారెడ్డి, కొండూరు కృష్ణారెడ్డి, బాబు, ఎల్లారెడ్డి, వెంకటరమణారెడ్డి, వెంకటరమణ, మునస్వామి, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: We will stand firm … we will support- Madanapalle MLA Nawaz Basha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page