ఐక్య విద్యార్థి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కై తహశీల్దార్ కి వినతి

0 9

బెల్లంపల్లిముచ్చట్లు:

 

 

తెలంగాణ ప్రభుత్వం మంచిర్యాల జిల్లా కు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లో ఏర్పాటు చేయాలని ఐక్య  విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కన్నెపల్లి నెన్నల మండల   తహశీల్దార్ లకు  వినతి పత్రం అందచేశారు..
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పాటుకు బెల్లంపల్లి అనువైన ప్రాంతమని రెండు జిల్లాల ప్రజల కు మధ్యలో బెల్లంపల్లి ఉంటుందని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉందన్నారు.గతంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో బెల్లంపల్లి ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు హామీ ఇచ్చిన విధంగా బెల్లంపల్లిలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు సింగరేణి క్వార్టర్స్, కార్యాలయాలు,200 పడకల సామర్థ్యం గల సింగరేణి ఏరియా ఆసుపత్రి అందుబాటులో ఉందని, 40 శాతం నిర్మాణ పనులు పూర్తయిన పాత కెమికల్ భవనము అందుబాటులో ఉందని ఈ విద్యాసంవత్సరం మెడికల్ కళాశాల ప్రారంభించడానికి అనుకూలంగా బెల్లంపల్లి ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సబ్బని రాజేంద్ర ప్రసాద్, అల్లి సాగర్,నాయిని మురళిశ్రావణ్, ఆదర్శ వర్ధన్ రాజు, లింగంపల్లి భీమేష్,శనిగారపు స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Request to the Tahsildar to set up a medical college under the auspices of the United Student

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page