కడియం  వర్సెస్ రాజయ్య

0 16

వరంగల్   ముచ్చట్లు :
టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదని ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశిస్తూకడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కడియం పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి రావడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు.స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని, పదవి ఉన్నా, లేకున్నా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజలకు మేలుచేసే పనులు ఎవరు చేసినా స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. కడియం శ్రీహరి నిజాయతీగా పని చేస్తాడని ప్రజల్లో తనకు గుర్తింపు ఉందన్నారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేని వారు హడావుడి చేయడం విడ్డురంగా ఉందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి ఈ నెల 2తో ముగిసింది. దీంతో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య ఎద్దేవా చేశారు. దీంతో రాజయ్య మాటలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ప్రజాసేవ చేయాలంటే ప్రోటోకాల్ అవసరం లేదని అన్నారు. తనకు ప్రజలిచ్చిన ప్రొటోకాల్‌తో సేవ చేస్తానని తెలిపారు.స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒకప్పుడు కడియం శ్రీహరి, రాజయ్య రాజకీయ ప్రత్యర్థులు. రాష్ట్ర విభజనతో రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ టీఆర్ఎస్‌లో చేరారు. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. అయితే వారిద్దరి మధ్య ఇంకా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. టీఆర్ఎస్ పెద్దలు సయోధ్య కుదర్చినప్పటికీ అంతగా ఫలించలేదు. తాజాగా వీరిద్ధరి మధ్య యుద్ధం మళ్లీ బయటపడింది.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:Kadium vs. Rajya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page