జడ్పి చైర్మన్ వైఖరిని మార్చుకోవాలి

0 9

ములుగు ముచ్చట్లు:

జెడ్పిచైర్మెన్ కుసుమ జగదీశ్వర్ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జడ్పి ఫ్లోర్ లీడర్ తుమ్మల హరిబాబుతో పాటుగా  ములుగు, వెంకటాపుర్, తాడ్వాయి జడ్పీటీసీ సభ్యులు సకినాల భవాని, గై రుద్రమదేవి, బడే నాగజ్యోతి సమావేశాన్ని బహిష్కరించారు.ఈ సందర్భంగా హరిబాబు గారు మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఎంతో నమ్మకంతో కుసుమ జగదీశ్వర్ ని జిల్లా ఛైర్మన్ గా, తెరాస ములుగు నియోజకవర్గ ఇంచార్జి గా నియమించగా ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ఆయన తెలియజేసారు.
తమ మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహార శైలి ఉంటుందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు.ఎంతో నమ్మకంతో ప్రజలు తెరాస అభ్యర్థులను గెలిపించి పట్టం కట్టారని చెప్పారు, వారి నమ్మకాన్ని నిజం చేసేలా జిల్లాను అభివృద్ధి చేయాల్సిన గురుతరమైన బాధ్యత తెరాస ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.నిధుల మంజూరు విషయంలో కూడా ఆయన ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పారు.మండలంలో గ్రూప్ రాజకీయాలను పెంచి పోషిస్తూ పార్టీ బలహీనపడడానికి కారణమవుతున్నారని అన్నారు.ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం లేకుండానే తన అనుచరులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నడని చెప్పారు.
ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి తీరని నష్టం చేస్తున్నాడని తెలియజేసారు.
అభివృద్ధి కార్యక్రమాలు సైతం కుంటుపడుతున్నాయని అన్నారు.
కరోన కష్టకాలంలో పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలవాల్సిన తరుణంలో కూడా జడ్పి చైర్మన్ ఎటువంటి చొరవ చూపలేకపోయారని తెలియజేసారు.గత శాసన సభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఒడిపోయినప్పటికి ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  ములుగు జిల్లాను ప్రకటించిన నేపధ్యంలో  పార్టీ పటిష్ట పడాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతుందన్నారు.ఈ నేపధ్యంలో ఆయన వైఖరిని నిరసిస్తూ పార్టీని, ప్రజాలను దృష్టిలో ఉంచుకొని సమావేశాన్ని బహిష్కరించామని తుమ్మల హరిబాబు  అన్నారు.ఇప్పటికైనా ఆయన వైఖరిని మార్చుకోకపోతే పార్టీ అధిష్టానం దృష్టికి సమస్యను తీసుకెళ్తమన్నారు.
జడ్పీటీసీ సభ్యులందరం పలుమార్లు జడ్పి చైర్మన్ కలిసి సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుందాని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

 

Tags:Zadpi needs to change the attitude of the chairman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page