జులై1న పుంగనూరులో జిక్సిన్‌ కంపెనీ పనులు ప్రారంభం – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌ల రాక

0 380

పుంగనూరుముచ్చట్లు:

 

మూడు దశాబ్ధాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పుంగనూరు నియోజకవర్గంలో రూ.57 కోట్లతో జిక్సిన్‌ వారి కంపెనీ సిలిండర్లు, బ్యాటరీల తయారీ పరిశ్రమ పనులను జులై 1న ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ఎండి రాహుల్‌ కరణం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు కలసి మండలంలోని ఎంసి.పల్లె వద్ద నిర్మించనున్న జిక్సిన్‌ పరిశ్రమకు భూమి పూజ చేసి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. 23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. జిక్సిన్‌, సిలిండర్లు, బ్యాటరీలు హై స్కీల్డ్ ఎల్‌.పి.జి -హాట్‌ రిపేర్‌ వంటగ్యాస్‌ సిలిండర్ల ఏటా 7.20 లక్షల సిలిండర్లను తయారు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 125 ఎండబ్యూ/హెచ్‌ఆర్‌ లి•యం-అయాన్‌ సెల్స్/బ్యాటరీ తయారీ పరిశ్రమను కూడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 900 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. పనులు ప్రారంభిస్తుండటంతో పుంగనూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Jixin‌ Company starts operations on July 1 in Punganur  Arrival of Minister Peddireddy, MP Gemini

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page