తాహసిల్దార్ పై పెట్రోల్, గిరిజనుల నిరసన

0 18

మెదక్ ముచ్చట్లు :

 

మెదక్ జిల్లా శివంపేట మండలం తాళ్లపల్లి తండాలో విద్యుత్ షాక్ తో మంగళవారం నాడు రైతు మాలోతు బాలు మృతిచెందడంతో నేడు  తాండ వాసులు పెద్ద ఎత్తున శివంపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు మాలోతు బాలు శవాన్ని ఉంచి నిరసన కార్యక్రమం చేపట్టారు నిరసన కార్యక్రమం సందర్భంగా కొంత మంది గిరిజనులు పెట్రోల్ డబ్బాలతో వచ్చి పెట్రోల్ పోసుకొని ఎమ్మార్వో భాను ప్రకాష్ పై కూడా పెట్రోల్ చల్లారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తాళ్ల గడ్డ తండా లో భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం వహించారని నిరసిస్తూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మాలోతు బాలు  పేరుమీద భూమి ఉన్నప్పటికీ కొత్త పాస్ బుక్కులు రాకపోవడం వల్ల చనిపోయిన రైతులకు రైతుబంధు గాని రైతు ఇన్సూరెన్స్ కానీ రావడంలేదని ఈ పరిస్థితికి కారణం రెవెన్యూ అధికారి నేనని నిరసిస్తూ , గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఒక దశలో ఎమ్మార్వో పై కూడా పెట్రోల్ చల్లిన గిరిజనులు దాడికి యత్నించారు అక్కడికి వచ్చిన శివంపేట ఎంపీపీ హరికృష్ణను గిరిజనులు చుట్టుముట్టి గెరావ్ చేశారు. శివంపేట మండలంలో నెలకొన్న భూ సమస్యను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే గిరిజనులకు ప్రభుత్వ సహకారం అందడం లేదని నిరసిస్తూ గిరిజనులు తీవ్ర ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసారు.  న్యాయం చేస్తామని ఆందోళనకారులకు నచ్చజెప్పారు.

 

 

- Advertisement -

Tags:Patrol, tribal protest against Tahasildar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page