తూర్పు లడఖ్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత

0 12

న్యూఢిల్లీ  ముచ్చట్లు :

తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య గతేడాది మే తొలివారం నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతం నుంచి భారత, చైనా దళాలు తరలింపు ప్రక్రియ మర్నాడు ఫిబ్రవరి 11 నాటి ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. ఇరు దేశాల పోస్ట్‌ల మధ్య దూరం కేవలం 150 మీటర్లే ఉన్నట్టు ఈ ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఇది స్పష్టమైన సంకేతం. చైనాను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్‌ చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేస్తోందిదక్షిణ పాంగాంగ్ రెజాంగ్ లా ప్రాంతంలో 17,000 అడుగుల ఎత్తులో ఉన్న సైనికులు గుడారాలు, స్థావరాలతో ఉన్న ఫోటోలను గూగుల్ ఎర్త్ ప్రో ఇటీవల అప్‌డేట్ చేసింది. అయితే, ఈ దూరం ఇంకా తక్కువగానే ఉన్నట్టు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. కైలాష్ పర్వత శ్రేణి వెంబడి ఉన్న ప్రదేశాలలో ఇరువైపులా ట్యాంకులు ఒకదానికొకటి 50 మీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే, ఇక్కడ జనవరి 10 న ఉపసంహరించుకున్న యుద్ధ ట్యాంకులను గూగుల్ ఎర్త్ చూపలేదు.ఈ ప్రాంతంలోని రెండు ప్రధాన భారతీయ ఆర్మీ స్థావరాలను శాటిలైట్ ఫోటోలు చూపుతున్నాయి. డజన్ల కొద్దీ ఆలివ్ గ్రీన్, ఆల్పైన్ వైట్ గుడారాలు ఒక రిడ్జ్-లైన్ కింద ఖచ్చితంగా ఉన్నాయి. గూగుల్ ఎర్త్ ఈ ప్రాంతాన్ని వాస్తవాధీన రేఖగా గుర్తించింది. కొన్ని భారత సైన్యం టెంట్లు ఈ ఎల్ఓసీని మార్కింగ్‌కు దాటి ఉన్నాయి. అయితే, వాస్తవాధీన రేఖగా భారత్ గుర్తించిన భూభాగంలో మాత్రం సైనికులను మోహరించామని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. రెజాంగ్ లా ప్రాంతంలో 15,400 నుంచి సుమారు 17,000 అడుగుల వరకు ఎత్తైన పర్వత శిఖరాలపైనే భారత దళాలను మోహరించారు.భారత సైన్యానికి కౌంటర్‌గా చైనా తన దళాలను మోహరించింది. స్పాంగ్‌గుర్ సరస్సు ఒడ్డున సుమారు 10 కి.మీ.మేర చైనా సైన్యాలున్నట్టు ఉపగ్రహ చిత్రాలు వివరిస్తున్నాయి. ఘర్షణ ప్రాంతం నుంచి సుమారు 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి వెనుక స్థానాల్లో ఆర్టిలరీ గన్ ఎంప్లాస్‌మెంట్లు, మౌలిక సదుపాయాలతో సహా భారీగా సైనిక స్థానాల నిర్మాణాలు కనిపిస్తున్నాయి.గతేడాది ఆగస్టు చివరలో తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో చైనా బలగాలు ఖాళీ చేయడానికి నిరాకరించడంతో దక్షిణ తీరంలోని కైలాష్ శ్రేణిలో ఎత్తైన ప్రదేశాలను భారత సైన్యం ఆక్రమించింది. దీంతో చైనాపై భారత్ పైచేయి సాధించింది. చైనా సైన్యం ప్రయత్నాలకు ధీటుటా భారత సైన్యం స్పందించింది. దీంతో డ్రాగన్ వెనకడువేయక తప్పలేదు

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Ongoing tension in eastern Ladakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page