నల్లబ్యాడ్జీలు ధరించి మినిస్ట్రియల్ స్టాఫ్ ఉద్యోగుల నిరసన

0 20

పెద్దపల్లి ముచ్చట్లు :
మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపుర్ ఏరియా హస్పిటల్ లోని మినిస్టీరియల్ ఉద్యోగిపై దాడికి నిరసనగా మంగళవారం జీడీకే1 సి.యస్.పి ఉద్యోగులు నల్ల నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం సి.యస్.పి హెచ్ ఓ ఢీ బూస శ్రీనాథ్ కి మెమొరాండం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఈ నెల 28న రామక్రిష్ణాపుర్ ఏరియా హస్పిటల్ లో డిప్యుటి సుపరింటెండెంట్ గా పని చేస్తున్న అలగం సుధాకర్ అనే మినిస్ట్రియల్ స్టాప్ ఉద్యోగిని అకారణంగా బూతులు తిట్టి, దాడి చేసిన డాక్టర్ లోకనాథ రెడ్డి క్షమాపణ చెప్పాలని, డ్యూటిలో ఉన్న అలగం సుధాకర్ అనే డిప్యుటీ సుపరింటెండెంట్ ను అకారణంగా కొట్టినందుకు డాక్టర్ లోకనాథ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మినిస్ట్రియల్ స్టాఫ్ ఉద్యోగులు సింగరేణి మెనేజ్మెంట్ లో బాగమని, ఇలా భౌతిక దాడులు చేయడం సరియైనా చర్య కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.పోశయ్య, ఎ.జలపతి రెడ్డి, డి.వేణు, వి.విఠల్, శ్రీనుకుమార్, యస్.రమేష్, కొమురయ్య, సతీష్, శ్రీనివాస రెడ్డి, నరేందర్, కే.శ్రీనివాస్, రామస్వామి, రాజయ్య, చంద్రమౌళి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Protest of ministerial staff wearing black badges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page