ఫెయిల్యూర్ ముద్రతో ఉత్తముడు

0 6

హైదరాబాద్   ముచ్చట్లు :

పేరుకు తగ్గట్టు ఉత్తముడే. కానీ ఏం లాభం? కాలం కలసి రాలేదు. తాను చీఫ్ గా ఉన్న సమయంలో పార్టీని అధికారంలోకి తేలేకపోయారు. ఫెయిల్యూర్ అధ్యక్షుడిగా ముద్రపడి పోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి నుంచి దిగిపోయినా ఆయన హయాంలో మాత్రం పార్టీ ఎదుర్కొన్న ఓటములు అంతసులువుగా మర్చిపోయేవి కావు. ఉత్తమ్ సారథ్యంలో పార్టీ పూర్తిగా దిగజారిపోయిందన్న ప్రత్యర్థుల వ్యాఖ్యలను పక్కన పెడితే.. ఆయన చిత్తశుద్దిని మాత్రం శంకించాల్పిన పనిలేదు.ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేత. విలువలున్న నేత. వివాదాలకు దూరంగా ఉంటారు. నల్లగొండ జిల్లాలో కొద్ది మంది నేతలతో తప్ప ఆయనకు మరెవ్వరితో బేధాభిప్రాయాలు తలెత్తలేదు. అందరిని సమన్వయం చేసుకుని పోయే తత్వం. అలాంటిది ఆయన పీసీసీ చీఫ్ గా గతంలో ఎవరూ లేని విధంగా ఎక్కువ కాలం వ్యవహరించారు. అయితే ఆయన చీఫ్ గా ఉన్న సమయంలో దక్కిన ఓటములు కూడా ఎవరి రికార్డుల్లో లేవు.ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో 2014, 2018 ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభావం ఎదురయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో రెండుసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు. కేసీఆర్ వ్యూహాల ముందు చిత్తయ్యారు. ఇక ఈ ఏడేళ్లలో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు విజయం దక్కలేదు. కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కూడా కోల్పోవాల్సివచ్చింది.2018లో తాను గెలిచిన హుజూర్ నగర్ లో కూడా పార్టీని గెలిపించలేకపోయారు. ఇక వరసగా దుబ్బాక, నాగార్జునసాగర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఇలా వరసగా కాంగ్రెస్ కు అపజయాలే ఎదురయ్యాయి. ఇక నేతలను కాపాడుకోవడంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిలయ్యారు. రెండుసార్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరినా చేష్టలుడిగి చూస్తుండి పోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫల పీసీసీ చీఫ్ గా ముద్రపడిపోయారు. కొత్తగా వచ్చే పీసీసీ చీఫ్ ఏ మేరకు పార్టీని బలోపేతం చేస్తారన్నది చూడాల్సి ఉంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Better with failure seal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page