బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

0 9

కామారెడ్డి ముచ్చట్లు :

కామారెడ్డి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారని, ఓట్ల కోసమే అసత్య ప్రచారాలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని స్వరాష్టం ఏర్పడి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా చదువుకున్న పట్టభద్రుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమవుతున్నారని, 2014 నుండి ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా 31నెలల పూర్తి నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలన్నారు.2021 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానన్న కేసీఆర్ రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వనికి సిగ్గుచేటని, ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన చేయాలనీ డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నత స్థానంలో ఉన్న కలెక్టర్ ఒక్క దొరకి మొక్కినట్టు ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడం సిగ్గు మాలిన చర్య అని వెంటనే రాష్ట్ర ప్రజలందరికి అయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Collectorate siege under BJYM

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page