భర్త హత్యకేసులో భార్య ఆరెస్టు

0 13

నెల్లూరు   ముచ్చట్లు :
నిత్యంమద్యంమత్తులో వేధించే భర్త ఆగడాల నుంచి బయటపడడం..పరాయిపురుషుడు సాంగత్యం, కోసం కట్టుకున్న భర్తనే అత్యంతదారుణంగా కడతేర్చిన ఓ మహిళ కథ ఇది…. అడ్డుగాఉన్నభర్త ను వదిలించుకునేందుకు కొందరిసహకారంతో హత్య చేయించింది. ఆనేపం తనపైకి రాకుండా ఉండేందుకు అత్యంత ప్రణాళిక రచించింది… ఏమీ ఎరగనట్టు నాటకం ఆడింది.. తమదైన రీతిలో విచారించిన పోలీసులకు అసలు విషయం చెప్పింది… నెల్లూరు నగరంలో సంచలనం కలిగించిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
నగరంలోని జాకీర్ హుస్సేన్ నగర్ లో వారం క్రితం జరిగిన ఫయాజ్ హత్య కేసును నవాబ్ పేట పోలీసులు ఛేదించారు.భర్త వేధింపులు తట్టుకోలేకే స్నేహితుల సాయంతో హత్యకు సహకరించినట్లు భార్య కల్యాణి ఒప్పుకుంది.నిందితురాలు కల్యాణితో పాటు కరిముల్లా, ప్రసాద్, మల్లి, ప్రకాష్ లను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రోకలి బండ, సుత్తిని స్వాధీనం చేసుకున్నరు.హత్య కేసు వివరాలును టౌన్ డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:Wife arrested in husband murder case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page