మన్ కీ బాత్ …కు వరంగల్ ఛాయ్ వాలా

0 12

న్యూఢిల్లీ  ముచ్చట్లు :
దేశ ప్రధాని నరేంద్రమోదీ వివిధ అంశాలపై నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’లో పాల్గొనే అవకాశం వరంగల్‌ నగరానికి చెందిన చాయ్‌వాలాకు దక్కింది. ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో సిద్ధంగా ఉండాలని నగరంలోని పాటక్‌ మహేలా ప్రాంతానికి చెందిన ఛాయ్‌ వాలా మహ్మద్‌ పాషాకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి లేఖ అందింది. ఈ విషయాన్ని వరంగల్‌ జిల్లా మెప్మా పీడీ భద్రు  ధ్రువీకరించారు.మహ్మద్‌ పాషా ఎంజీఎం ఆస్పత్రి వద్ద 40 ఏళ్లుగా ఫుట్‌పాత్‌పై చాయ్‌షాపు పెట్టి జీవిస్తున్నారు. ఆయన గతేడాది ఆగస్టులో పీఎం ఆత్మనిర్భర్‌ పథకం ద్వారా రూ.10వేల రుణాన్ని తీసుకుని సద్వినియోగం చేసుకోవడంతో పాటు టీ అమ్మకాల రూపేణా గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ మొదటి స్థానంలో నిలిచారు. ఆత్మనిర్భర్‌ ద్వారా రుణం పొందిన వీధి వ్యాపారుల్లో అతి తక్కువ మందిని మన్‌ కీ బాత్‌కు ఎంపిక చేయగా, అం దులో పాషా ఒకరని భద్రు తెలిపారు.  పీఎంఓ నుంచి ఫోన్‌ వచ్చిన విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పాషా చెప్పారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:Warangal Chai Wala to Man Ki Baat …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page