మావోయిస్టుల కుటుంబ సభ్యులకు పోలీసుల కౌన్సెలింగ్…..

0 10

జన జీవన స్రవంతిలో కలవడానికి కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవాలని పిలుపు

బెల్లంపల్లి  ముచ్చట్లు :

- Advertisement -

అజ్ఞాతంలో ఉన్న కేంద్ర స్థాయి మావోయిస్టు నాయకులు ఇటీవల కరోనా బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు.ఎన్నో ఏండ్లుగా అజ్ఞాతంలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారని కానీ కరోనా విపత్కర పరిస్థితుల్లో సరైన వైద్యం అందక చనిపోవడం జరుగుతుందని ప్రభుత్వం వీరిపై ఉన్న కేసులను ఎత్తివేసి వైద్యాన్ని అందించడానికి ముందుకు వచ్చిందని మావోయిస్టు కుటుంబ సభ్యుల ద్వారా వారికి సమాచారం చేరే విదంగా పోలీసులు కొత్తగా కార్యక్రమాన్ని రూపొందించారు…మంచిర్యాల  జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కటకం సుదర్షన్ అలియాస్ ఆనంద్ 1978 ఎమర్జెన్సీ సమయంలో మావోయిస్టు కార్యకలాపాలు చురుకుగా సాగుతున్న సమయంలో ఆకర్షితుడై పార్టీలో చేరడం జరిగింది.అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర మావోయిస్టు కమిటీ సభ్యుడిగా ఉన్న సుదర్షన్ 70 సంవత్సరాల వయసున్న ఇప్పటికికూడా అజ్ఞాతంలోనే ఉన్నాడని అందుకే వనం వీడి జనంలోకి రావాలని పిలుపునిస్తూ సుదర్శన్ కుటుంబ సభ్యులనూ రామగుండం సీపీ సత్యనారాయణ కలవడం జరిగింది.వీరికి బియ్యం,దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ వనం వీడి జనంలోకి రావాలని మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు తెలపడం జరుగుతుందని కుటుంబసభ్యులు సైతం లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని కోరడం జరిగిందని కరోనా విపత్కర పరిస్థితుల్లో అడవుల్లో సరైన వైద్యం అందక మావోయిస్టు అగ్ర నాయకులు చనిపోవడం జరుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని కుటుంబసభ్యుల ద్వారా లొంగిపోవాలని కోరడం జరిగిందని అన్నారు.అలాగే వీరి పైన ఉన్న 1కోటి 20 లక్షల రివార్డ్ వీరికే ఇవ్వడం జరుగుతుందని అలాగే ప్రభుత్వ పరంగా వీరికి అందే అన్ని సదుపాయాలు ఇప్పిస్తామని మీడియా ద్వారా నైనా రాజకీయ నాయకుల  ద్వారా లొంగిపోవచ్చని అన్నారు.ఇది ఒక సదవకాశం అని ఒకవేళ లొంగిపోకపోతే చట్టం పని చట్టం చేసుకుపోతుందని అజ్ఞాతంలో ఉంది కన్నవారికి కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల సాదించినదేమి లేదని పైగా కుటుంబంలో ముసలి వాళ్ళైన తల్లితండ్రులను కడసారి  చుసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని కటకం సుదర్శన్ తండ్రి, భార్య చనిపోయిన చూసుకునే పరిస్థితి లేకుండాపోయిందని ఇప్పటికైనా శేష జీవితం తల్లి కుటుంబ సభ్యుల మధ్య గడపడానికి లొంగి పోవాలని కోరారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Police counseling for Maoist family members …..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page