విస్తీర్ణం పెరిగినా పెరగని దిగుబడి

0 11

కాకినాడ ముచ్చట్లు:

 

నిరుడు ఖరీఫ్‌ వరి ఉత్పాదకత నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఏడేళ్లల్లో కనిష్టంగా నమోదైంది. ఉత్పత్తి రెండవ కనిష్టంగా రికార్డయింది. 2020-21 ఖరీఫ్‌, రబీ పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రభుత్వం నాల్గవ ముందస్తు అంచనాలు రూపొందించగా, గతేడాది ఖరీఫ్‌లో వరి దిగుబడులకు భారీగా దెబ్బ తగిలిందని వెల్లడైంది. తుపాన్లు, అధిక వర్షాలు, వరదలు, కరువు, కరోనా అన్నీ కట్టకట్టుకొని దాడి చేసిన ఫలితంగా వరి ఉత్పాదకత ఏడేళ్లల్లోకెల్లా కనిష్టానికి క్షీణించింది. మొన్న బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వేలో మూడవ ముందస్తు అంచనాల ప్రాతిపదికన వరి ఉత్పత్తి, ఉత్పాదకతలను పేర్కొనగా, రెండు మాసాల అనంతరం వేసిన నాల్గవ ముందస్తు అంచనాలో సర్వేలో చెప్పిన దాని కంటే తగ్గింది. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గుదలకు కారణమైంది.నిరుడు ఖరీఫ్‌లో వరి 15.98 లక్షల హెక్టార్లలో సాగవుతుందని, 81.48 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి లభిస్తుందని, ఉత్పాదకత హెక్టారుకు 5,099 కిలోలని ఆగస్టులో వేసిన తొలి అంచనాల్లో తెలిపారు. మరలా డిసెంబర్‌లో వేసిన రెండవ అంచనాల్లో 16.01 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుందని విస్తీర్ణాన్ని స్వల్పంగా పెంచి, దిగుబడిని మాత్రం 72.37 లక్షల టన్నులకు, ఉత్పాదకతను 4,520 కిలోలకు తగ్గించారు.

 

 

 

- Advertisement -

బడ్జెట్‌కు ముందు మార్చిలో వేసిన మూడవ అంచనాల్లో విస్తీర్ణాన్ని 16.90 లక్షల హెక్టార్లకు పెంచి, దిగుబడి దగ్గర కొచ్చేసరికి మరోమారు 71.37 లక్షల టన్నులకు, ఉత్పాదకతను 4,223 కిలోలకు తగ్గించారు. జూన్‌లో వచ్చిన నాల్గవ అంచనాల్లో విస్తీర్ణాన్ని తిరిగి 16.01 లక్షల హెక్టార్లకు తగ్గించి, ఉత్పత్తిని 67.61 లక్షల టన్నులకు తగ్గించారు. ఉత్పాదకత మూడవ అంచనాల్లో పేర్కొన్న అంకెను పేర్కొన్నారు.నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఏడు ఖరీఫ్‌ సీజన్లు రాగా ఇప్పుడే ఉత్పాదకత కనిష్టంగా నమోదైంది. ఇంతకుముందు 2015-16లో ఉత్పాదకత 4,402 కిలోలు. ఇప్పటికి ఇదే కనిష్టం. కాగా 2020-21 ఖరీఫ్‌లో అంతకంటే తక్కువ 4,223 కిలోలుగా చెబుతున్నారు. ఉత్పత్తి దగ్గరకొస్తే 2015-16లో 61.59 లక్షల టన్నులచ్చాయి. ఏడేళ్లలో అదే కనిష్టం. ఆ తర్వాత నిరుడు ఖరీఫ్‌ ఉత్పత్తి రెండవ కనిష్టం. నిరుడు 67.61 లక్షల టన్నులని నాల్గవ అంచనాల్లో తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ఏడేళ్లల్లోకెల్లా గరిష్ట వరి ఉత్పత్తి, ఉత్పాదకత 2019-20లో లభించింది. అప్పుడు ఉత్పత్తి 80.13 లక్షల టన్నులు, ఉత్పాదకత 5,250 కిలోలు.కల్లా ఖరీఫ్‌ వరి ఉత్పత్తి 2015-16లో కనిష్టం. అప్పుడు 13.99 లక్షల హెక్టార్లలో సాగైంది. 2020-21లో విస్తీర్ణం 16.01 లక్షల హెక్టార్లు. ఇప్పుడు 67.61 లక్షల టన్నులతో రెండవ కనిష్ట ఉత్పత్తి నమోదైంది.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Yield that does not increase as acreage increases

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page