స్కూళ్ల దగ్గర  మద్యం షాపులు ఉంటే…యాక్షనే

0 15

విజయవాడ ముచ్చట్లు :

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తూ ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది.ఏఎన్‌ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఏఎన్‌ఎం వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. దీని కోసం ఒక ప్రత్యేక యాప్‌ను కూడా తయారుచేశారు. ఈ యాప్‌ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేస్తుండాలి. స్కూళ్లకు సమీపంలో ఎవరైనా సిగరెట్, గుట్కా, పాన్‌షాపులు నిర్వహిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. పాఠశాలల సమీపంలో ఎవరైనా స్మోకింగ్‌ చేసినా కూడా అట్టివారిపై కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. పాఠశాలల దరిదాపుల్లో మద్యం షాపులు కనిపించినా, ఎవరైనా మద్యం సేవించినా వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు.ఇందుకోసం ప్రతి స్కూల్‌నూ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్‌ చేస్తారు. మ్యాపింగ్‌ అనంతరం వీటిని ఆన్‌లైన్‌ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన చర్యలు చేపట్టింది. అలాగే స్కూల్‌ ఆవరణలో స్మోకింగ్‌ వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను కూడా ఏర్పాటు చేస్తారు. ఉపాధ్యాయులెవరైనా స్కూల్‌ ఆవరణలో స్మోకింగ్‌ చేస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు. త్వరలో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:If there are liquor shops near schools … action

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page