పెన్షనర్ల  నేత గంగాధర్ అనారోగ్యంతో  మృతి

0 22

జగిత్యాల ముచ్చట్లు:

తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నేత ,కోరుట్ల డివిజన్ కార్యదర్శి గుడ్ల గంగాధర్  (72)మంగళవారం అనారోగ్యంతో  మృతిచెందారు.  సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి,   పెన్షనర్స్  జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, కోరుట్ల డివిజన్ పెన్షనర్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, తదితర జిల్లా,డివిజన్ల పెన్షనర్స్,సీనియర్ సిటిజెన్స్ సంఘాల నేతలు గంగాధర్ అంత్యక్రియల్లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కోరుట్ల డివిజన్ లో పెన్షనర్లకు, సీనియర్ సిటిజెన్స్ కు  విశిష్ట సేవలందించిన గంగాధర్ మరణం జిల్లా పెన్షనర్స్, సీనియర్ సిటిజెన్స్ కు,ఆయా సంఘాలకు తీరని లోటన్నారు. పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సన్న,సీనియర్ సిటిజెన్స్ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు,కరీంనగర్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేశవ రెడ్డి,లింగయ్య,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,జిల్లా రెవెన్యూ అధ్యక్షుడు ఎం.డీ.వకీల్, పెన్షనర్ల నాయకులు వనమాల సత్యనారాయణ,వెలుముల ప్రకాష్,విద్యాసాగర్,నారాయణ, దొంతుల లక్ష్మికాంతం,కరుణ, కోరుట్ల డివిజన్ నాయకులు రాజ్ మోహన్,సైఫోద్దీన్,రాములు,లక్ష్మిరాజం,18 మండలాల పెన్షనర్స్, సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Pensioner leader Gangadhar dies of illness

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page