అర్బన్ హెల్త్ సెంటర్ పనులు వెంటనే ప్రారంభించాలి: సబ్ కలెక్టర్ బాపిరెడ్డి కి వినతి

0 10

నెల్లూరు ముచ్చట్లు:

గూడూరు  పట్టణంలోని ప్రభుత్వ ఆస్దులను ఎట్టి పరిస్థితులలోనూ పరులపాలు కానివ్వమని, అర్బన్ హెల్త్ సెంటర్ పనులలో వెంటనే ప్రారంభించాలని గూడూరు పట్టణ  ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ బాపి రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఐక్యవేదిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్థులు కాపాడాలి, అర్బన్ హెల్త్ సెంటర్ పనులను వెంటనే ప్రారంభించాలంటూ  నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని పెద్ద మశీదు సమీపంలో ఉన్న ఫైలేరియా ఆసుపత్రి స్థానంలో ప్రభుత్వం వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్  నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. 69 లక్షల రూపాయల నిధులను కూడా ఆరు నెలల క్రితమే మంజూరు చేసినప్పటికీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆసుపత్రి ఏర్పాటుతో సుమారు 30వేల మంది ప్రజలకు ఉపయోగ పడుతుందన్నారు. కొంతమంది ప్రభుత్వ స్దలాలను కబ్దా చేయడమే విధిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒకవేళ ఫైలేరియా ఆస్పత్రి స్థలాన్ని ప్రయివేటు వ్యక్తులకు కేటాయిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ బాపిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

- Advertisement -

దీనికి స్పందించిన సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఫైలేరియా ఆసుపత్రి స్థలంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర సంస్థలకు కేటాయించమన్నారు. ఒకవేళ ఎవరైనా ఆక్రమణలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం కూడా అర్బన్ హెల్త్ సెంటర్ పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో  ఐక్యవేదిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లూరు యాదగిరి, సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్. కాలేషా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ పరిమళ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి రావూరు బ్రహ్మయ్య, బీఎస్పీ సీనియర్ నాయకులు నాశిన భాస్కర్ గౌడ్, జిల్లా కార్యదర్శి మీజూరు సుబ్రమణ్యం, టీడీపీ యువత ఉపాధ్యక్షులు ఆర్ఎస్ కే. సద్దాం, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్, ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాకాని వెంకటేశ్వర్లు, ఇన్సాఫ్ కమిటీ నాయకులు షేక్. జమాలుల్లా, షేక్. చాన్ బాష, సయ్యద్ జమీల్ అహ్మద్, ఎంఆర్ పీఎస్ నాయకులు పెంచలయ్య, శ్రీనివాసులు, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు ఏ. కేశవులు, పామంజి మణి, బీవీ. రమణయ్య, బుడతాటి చంద్రయ్య, అడపాల ప్రసాద్, ఎం. వెంకట్రావు, శ్రీనివాసాచారి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Urban Health Center works should start immediately: Request to Sub Collector Bapireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page