ఆక్రమ అరెస్టులతో ఉద్యమాలను అపలేరు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

0 14

జగిత్యాల  ముచ్చట్లు:
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఇదే ఆంశంపై పోరాటం చేస్తున్న సిపిఎం ఉద్యమకారులను అరెస్ట్ చేస్తూ ఉద్యమాలను అపలేరని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేవరకు పోరాటం ఆగదని సిపిఎం జగిత్యాల జిల్లా కార్యదర్శి జి. తిరుపతి నాయక్ అన్నారు. బుధవారం పెంచిన ధరలపై పోరాటం చేస్తున్న సిపిఎం శ్రేణులను అక్రమ అరెస్ట్ కు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక తహశీల్ చౌరస్తాలో దగ్ధం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తిరుపతినాయక్ జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచి పేద, మద్య తరగతి ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. పెట్రో, డిజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తేవాలని వామపక్షాలు అనేక పోరాటాలు చేస్తున్నా మోడికి కనువిప్పు కలగకపోవడం సిగ్గుచేటన్నారు. అకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదలు కనీసం తిండి కూడా తినడానికి నోచుకోవడలేదని వెంటనే పెంచిన పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించాలని తిరుపతినాయక్ డిమాండ్ చేశారు.కేంద్రంలో మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తిగా కార్పోరేటు శక్తులకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని ప్రజావ్యతిరేక పాలనకు మోడి శ్రీకారం చుట్టారన్నారు.అక్రమ అరెస్టు ఉద్యమాలను అపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని రాజ్ భవన్ ముట్టడికి పిలుపు నిచ్చిన వామపక్షాల నాయకులను ఇళ్ళల్లోంచి అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అపాలని పగటి కలలు కంటున్నారని తిరుపతినాయక్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమం లో ఎఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి ఎన్.లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాయిని శారదలు ప్రసంగించారు. ఇందులో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఇందూరి సులోచన,ఎఐఎఫ్ టియు నాయకులు బి.లతా, సిహెచ్ కరుణాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మొగిలితోపాటు పలువురు ఉన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

- Advertisement -

Tags:Movements with aggressive arrests cannot be stopped
Inflated petrol and diesel prices should be reduced immediately

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page