ఇండియన్ మార్కెట్లోకి వ్యాక్సిన్లు

0 12

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

భారతదేశ ప్రజలకి మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్, ఇంకా రష్యా నుండి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వి. ఈ మూడు వ్యాక్సిన్లు కరోనా నుండి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మరో వ్యాక్సిన్ కి భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఇండియాకి రానుంది. ఈ మేరకు నీతీ ఆయోగ్ ఆరోగ్య మెంబరు వీకే పాల్ తెలియజేసారు.భారతదేశానికి చెందిన సిప్లా కంపెనీ, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ ని అత్యవసర సమయంలో వాడడానికి ఉపయోగించే మందుగా భారతదేశానికి అందిస్తుంది. ఈ మేరకు అనుమతులు వచ్చాయి. ఐతే ఈ వ్యాక్సిన్ ని ఉపయోగించడానికి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, అమెరికాకి చెందిన ఫైజర్ వ్యాక్సిన్ కూడా ఇండియాలోకి రానుందని తెలుస్తుంది. మోడెర్నా వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఫైజర్ కూడా వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.మెరికాకు చెందిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సిన్‌ దిగుమతి, అమ్మకాల కోసం మల్టీ నేషనల్‌ ఫార్మా కంపెనీ సిప్లాకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. దీనిపై కాసేపటి క్రితమే కీలక ప్రకటన వెలువడింది. ఈ మోడెర్నా వ్యాక్సిన్‌ రాకతో… నాలుగో కరోనా వ్యాక్సిన్‌ దేశంలో అందుబాటులోకి వచ్చినట్లైంది. దీంతో దేశంలో వ్యాక్సిన్‌ కొరత కాస్త తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags: Vaccines into the Indian market

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page