ఇళ్ల నిర్మాణాలు పై ప్రత్యేక దృష్టి పెట్టండి జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) యన్.ఆర్ మౌర్య

0 17

ఆదోని ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇల్లులో భాగంగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతంగా  నిర్వహించాలని, మండలంకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఇళ్ల గ్రౌండింగ్  పూర్తిస్థాయిలో వంద శాతం చేపట్టాలని అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ యన్. ఆర్ మౌర్య  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఇందులో భాగంగా  జూలై 1, 3, 4 తేదీలలో ఆదోని రూరల్ లో రోజుకు 09 వందల 29 చొప్పున ఆదోని మండలంలో  కేటాయించిన 2 వేల 788 ఇళ్ల గ్రౌండింగ్ లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి 100 % గ్రౌండింగ్ అయ్యేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదోని మండలం (రూరల్) వ్యాప్తంగా మొదటిదశలో 2,788 ఇల్లు మంజూరు కాగా జూలై 1వ తేదీన 9 వందల 30, 3 వ తేదీన 9 వందల 29, 4వ తేదీన 9 వందల 29 చొప్పున మొత్తం 2 వేల 2,788 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. ఆదోని (అర్బన్) లో మొదటి దశ లో 3 వేల 725 మంజూరు కాగా రేపు 1వ తేదీన 1723 మొదలు పెట్టాలన్నారు. గృహ నిర్మాణాలకు ఆయా గ్రామాల వారీగా లబ్ధిదారులను సమాయత్తం చేయడంతో పాటు ఇందుకు అవసరమైన ఇసుక, ఇటుకలు, సిమెంటు సరఫరా తదితర గృహ నిర్మాణానికి సంబంధించి సామాగ్రి పై దృష్టిసారించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) యన్. ఆర్ మౌర్య ఆదేశించారు.
జూలై ఒకటవ తేదీ పింఛను పంపిణీకి ఇబ్బంది లేకుండా ఉదయం 9 గంటల లోపు పూర్తి చేసి హౌసింగ్ మేళా కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) యన్. ఆర్ మౌర్య ఆదేశించారు.వాలంటీర్లు యాప్ లో లబ్ధిదారుల ఫోటోలు తీసి వెంటనే అప్లోడ్ చేయాలి అన్నారు. లేఅవుట్లలో వాటర్ సప్లై లేకపోతే వెంటనే తాత్కాలిక వాటర్ ట్యాంకర్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పెషల్ ఆఫీసర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి నియోజవర్గ, మండల స్థాయి స్పెషలాఫీసర్ లు స్థానిక శాసనసభ్యులు, సర్పంచులు, సంబంధిత ప్రజా ప్రతినిధులతో మాట్లాడి ఇళ్ల గ్రౌండింగ్ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దూర ప్రాంతాల్లో ఉండే లేఅవుట్లకు లబ్ధిదారులు చేరుకునేందుకు వీలుగా మండల అధికారులు రవాణా సౌకర్యము ఏర్పాటు చేయాలన్నారు. గృహాల గ్రౌండింగ్‌ పై లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి పాల్గొన్న ఆదోని ఆర్.డి.ఓ రామకృష్ణారెడ్డి,  హౌసింగ్ పి.డి వెంకటనారాయణ, ఈ. ఈ గురు ప్రసాద్, డి. ఈ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆర్జివి కృష్ణ, తాసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో గీత వాణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేరు విజయ భాస్కర్, తదితరులు పాల్గొన్న

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Pay special attention to house construction
District Joint Collector (Housing) NR Maurya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page