ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక ,జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

0 9

విశాఖపట్నం  ముచ్చట్లు:
ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ ఖాళీలు భర్తీకి  ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రకటన పై రాష్ట్ర  ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పాడేరు ఐ. టి.డి.ఏ పిఓ ద్వారా వినతిపత్రాన్ని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.లక్కు,కె.పృథ్వి రాజు సర్పించారు.
పాడేరు ఐ. టి.డి.ఏ  కార్యాలయంలో పిఓ ఆర్.గోపాలకృష్ణ ను గిరిజన సంఘం ప్రతినిధులు బృందం కలిసి గిరిజనుల సమస్యలపై చర్చించడం జరిగింది.  2018 నుండి నేటి వరకు గిరిజన స్పెషల్ డి.ఏ.సి ద్వారా ఖాళీలు భర్తీ చేయకపోవడం తో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఫలితంగా గిరిజన విద్య అభివృద్ధికి ఆటంకాగా మారింది.  ఏజెన్సీ ప్రాంతంలో నూరు శాతం విద్య,ఉద్యోగ రిజర్వేషన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసి ఏడాదైనా పునరుద్ధరణ చేయకపోవడం తో గిరిజన నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశం కోల్పోయారు. గిరిజన సలహా మండలి (టి.ఏ.సి) లో ప్రత్యామ్నాయ  ఉత్తర్వులు జారీ చేసి ఏజెన్సీ ప్రాంతంలో నూరు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ వల్ల ఏజెన్సీ ప్రాంతాల  గిరిజన నిరుద్యోగులకు ఆశించినంత ప్రయోజనం ఉండదని ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీలు భర్తీకి ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి మంత్రి గారిని కోరడం జరిగింది.
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల భూ ఆక్రమణ ఎక్కువైందని, ఎల్.టి.ఆర్ కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేయాలని, ఎస్.డి.సి కార్యాలయం నుండి డిప్యుటేషన్ పై మైదాన ప్రాంతంలో వెళ్లిన 8 మంది డి.డి లను తిరిగి ఎస్.డి.సి ఆపీస్ కు నియమించాలని పిఓ గారిని కోరడం జరిగింది.1/70చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఎల్.టి.ఆర్ కేసులపై ఐ. టి.డి.ఏ రాష్ట్ర హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని, ఆంద్ర-ఒడిశా సరిహద్దు సమస్యలపై కోరాపుట్ మరియు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసాం.సీలేరు జెన్కో లో స్థానిక గిరిజనులతోనే ఖాళీలు భర్తీ చేయాలని,2012 నుండి జెన్కో లో నియమించిన గిరిజనేతరులను తొలగించాలని కోరడం జరిగింది. సమస్యలు పరిష్కరిస్తామని పిఓ గారు హామీ ఇచ్చారని తెలిపారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

- Advertisement -

Tags:A special, job calendar should be announced in the agency area

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page