ఒంగోలులో ఆంధ్రకేసరి వర్శటీ

0 4

విజయవాడ ముచ్చట్లు:

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో కీలక విషయాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సీటీతో పాటు విజయనగరంలోని జేఎన్‌టీయూ కళాశాలను యూనివర్సిటీగా మార్పునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖ జిల్లాలోని నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్‌కి భూములు అప్పగించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. తొమ్మిదో తరగతి నుంచే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు జగన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు 9 వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ఒంగోలు నగర శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటు చేయాలని జగన్ క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే విజయనగరం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్చేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అందుకోసం జేఎన్‌టీయూ చట్టం 2008కి సవరణ చేయనున్నారు.

 

 

 

- Advertisement -

టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం, 2021-24 ఐటీ నూతన విధానం, కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చించారు. మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. భూహక్కు చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్‌కి 81 ఎకరాల భూ కేటాయింపులకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలు, విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

 

 

 

9,10,11 వారికి ల్యాప్ టాప్ లు

ఏపీ కేబినెట్ మీటింగ్‌లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీస‌కున్నారు. ఏపీలోని 9 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. కరోనా కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.కరోనా కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ అంశంపై కేబినెట్ చర్చించింది. కీలకమైన 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయనున్నట్లు సమాచారం.ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాల విడుదలకు గాను విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలన్న అంశంపై ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి ఛాయరతన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. మరో రెండు, మూడు రోజుల్లో తమ నివేదికను ప్రభుత్వానికి అందించాలని భావిస్తున్న ఈ కమిటీ ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Andhra Kesari Varshati in Ongole

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page