కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

0 10

పెద్దపల్లి ముచ్చట్లు:

దళితులకు షూరిటీ లేకుండా నేరుగా రూ.10 లక్షలు ఖాతాలో జమ చేయడం పట్ల బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ ఇంజపురి పులేందర్ మాట్లాడుతు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకం దేశంలో కానీ ఎక్కడ కూడా లేదన్నారు. దళితుల పక్షాన నేనున్నా అని పెద్ద పథకం ప్రవేశ పెట్టడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. షూరిటీ లేకుండా నేరుగా రూ.10 లక్షలు ఖాతాలో జమ కావడం చాలా గొప్ప విషయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ నాయకులు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కోట్లపల్లి దుర్గాప్రసాద్, 28వ డివిజన్ ప్రెసిడెంట్ కొండ సురేష్, జక్కుల ప్రేమ్ కుమార్, మంథని రాంబాబు, నూకల రమేష్, మల్లేష్, శంకర్, దాసరి డివిజన్, యూత్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Anointing to paint KCR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page