గ్రామాలలో రేషన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి  ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం

0 8

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో రేషన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామీణ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులను కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్ డి ఓ, ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్,ఫుడ్ ఇన్స్పెక్టర్ లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ  నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో, ప్రజలకు రేషన్ అందించడంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని   అధికారులను కోరారు. ఏదైనా అనివార్య కారణాల వలన సమస్యలు ఏర్పడటం అయితే వాటి పరిష్కారానికి అధికారులు వెంటనే చొరవ చూపాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఆహార నియంత్రణ డిపార్ట్మెంట్ల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

- Advertisement -

Tags:Special attention should be paid to ration issues in villages
Meeting with officials at the Ardeo office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page