ఘనంగా పదవీ విరమణ సన్మాన సభ

0 26

తుగ్గలి ముచ్చట్లు:
మండల పరిధిలోని గుత్తి ఎర్రగుడి గ్రామ విఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ రావు పదవీ విరమణ వేడుకలను తుగ్గలి రెవెన్యూ అధికారులు ఘనంగా నిర్వహించారు.పదవీ విరమణ పొందిన ప్రసాద్ రావు దంపతులకు రెవెన్యూ అధికారులు శాలువాను కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.అనంతరం రెవెన్యూ అధికారులు బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా వీఆర్వో ప్రసాద్ రావు పదవీ విరమణ సన్మాన సభలో భాగంగా తహసిల్దార్ నిజాముద్దీన్ మాట్లాడుతూ అన్ని శాఖలలోని ప్రతి ఒక్క అధికారికి బదిలీలు మరియు పదవీ విరమణలు సహజమని ఆయన తెలియజేశారు.విధి నిర్వహణలో తమకు పెద్దదిక్కుగా ఉంటూ ఎన్నో సూచనలను సలహాలను ఇచ్చేవారని రెవెన్యూ అధికారులు ఆయనను కొనియాడారు.విధి నిర్వహణలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే వారిని అధికారులు తెలియజేశారు.పదవి విరమణ అనంతరం ఆయనకు,ఆయన కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి సుఖ సంతోషాలతో జీవించాలని రెవెన్యూ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి తహసిల్దార్ నిజాముద్దీన్,ఆర్.ఐ సుధాకర్ రెడ్డి, మండల సర్వేయర్ గాది లింగప్ప, జూనియర్ అసిస్టెంట్ రంగస్వామి,తుగ్గలి మండల విఆర్వోలు,తుగ్గలి మండలం సర్వేయర్లు,తుగ్గలి మండలం విఆర్ఏలు మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

- Advertisement -

Tags:Glorious Retirement Honors House

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page