టీడీపీ వాళ్లకే కాంగ్రెస్ పీఠం

0 4

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాను 5వ ఎస్టేట్‌గా అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఎంతో అవసరమ‌ని, అవన్నీ చేయలేనివి చేసేదే ఈ 5వ ఎస్టేట్ అని చెప్పారు. ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధం సోషల్ మీడియా అని అన్నారు. అలాంటి సోషల్ మీడియాకు హ్యాట్సాఫ్ అని అన్నారు. జులై 8వ తేదీన కొత్త పార్టీ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ప్రకటన ఉంటుంద‌ని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ‌లో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా పార్టీ పెడుతున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు.కులాలు, మ‌తాల‌కు అతీతంగా తమ పార్టీ ఉంటుంద‌ని షర్మిల చెప్పుకొచ్చారు. ఇలాంటివన్నీ చేయాలంటే సోషల్ మీడియా అవసరం ఎంతో ఉంటుందని షర్మిల అభిప్రాయ‌ప‌డ్డారు. నెటిజ‌న్ల మద్దతు లేకుండా తానేమీ చేయలేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ.. ఆ పార్టీకి సోషల్ మీడియా ఎంప్లాయిస్ కూడా ఉన్నారని చెప్పారు.

 

 

 

- Advertisement -

టీడీపీ నాయకుడిని తీసుకొచ్చి టీపీసీసీ చీఫ్‌ని చేశారని రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఎంప్లాయిస్ ఉన్నారని, కానీ త‌మ‌కు ఆ అవ‌స‌రం లేద‌ని ష‌ర్మిల చెప్పారు.వైఎస్ అభిమానులు, కార్యకర్తలే త‌న సైన్యమ‌ని అన్నారు. సోషల్ మీడియా లేకుండా ఎలాంటి పని ముందుకు సాగదని పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలు లైక్స్, షేర్స్ చేస్తూ అన్ని వేదికల్లో యాక్టివ్‌గా ఉండాలని, అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పారు. ఫేక్ న్యూస్ ఎండ‌గట్టే విధంగా పని చేయాలని ష‌ర్మిల కార్యక‌ర్తల‌కు పిలుపునిచ్చారు.హైదరాబాద్ లోటస్ పాండ్‌ వద్ద షర్మిల ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ బృందం అర్థరాత్రి తొలగించింది. వచ్చే నెలలో పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్న షర్మిల వరుస షాక్‌లు తగులుతున్నాయని పలువురు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. మొదట్లో వైఎస్ షర్మిల చేపట్టిన పలు కార్యక్రమాలకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం రానురాను ఆ పార్టీ కార్యక్రమాలపై నిర్బంధం కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: The TDP is the Congress seat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page