తిరుమ‌ల‌లో కాటేజిల ఆధునీక‌ర‌ణ ప‌నులు త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాలి – టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

0 10

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

 

తిరుమ‌ల‌లో వేలాది కాటేజిల ఆధునీక‌ర‌ణ ప‌నులు త్వ‌రిత గ‌తిన పూర్తి చేసి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకురావాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం ఉద‌యం టిటిడి సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో వ‌ర్చువ‌ల్ మీటింగ్ నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ కాటేజిల మ‌ర‌మ‌త్తు ప‌నులు స‌కాలంలో పూర్తి చేయాల‌ని సిఇ  నాగేశ్వ‌రావును ఆదేశించారు. అలిపిరి నుండి తిరుమ‌ల న‌డ‌క దారిలో జ‌రుగుతున్న పైక‌ప్పు నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పైక‌ప్పు నిర్మాణ ప‌నులు ఎంత‌ జ‌రిగింది, ఇంకా ఎంత ప‌ని చేయాల‌నే దానిపై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని కాటేజిల్లో ఎల‌క్ట్రిక్ మీటర్లు ఏర్పాటు, శ్రీ‌నివాస‌మంగాపురం వ‌ద్ద ఉన్న ఎస్వీ ఆయుర్వేద ఫార్మసిలో నిర్మాణా ప‌నులు, బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో నూత‌నంగా ఏర్పాటు చేస్తున్న చిన్న పిల్ల‌ల ఆసుప‌త్రి ప‌సులు, ఇత‌ర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ ప‌నుల‌పై ఆయ‌న స‌మీక్షించారు. స్విమ్స్, ఇత‌ర టిటిడి ఆసుప‌త్రుల‌కు మందులు కొనుగోలుకు సెంట్ర‌లైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సెల్ (కేంద్రీకృత సేకరణ సెల్ ) ఏర్పాటుపై ఆయ‌న స‌మీక్షించారు.

 

 

 

 

- Advertisement -

టిటిడిలో విధులు నిర్వ‌హిస్తున్న రెగ్యుల‌ర్‌, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల‌లో ఇంకా వ్యాక్సిన్ వేసుకొని వారిని గుర్తించి సంబంధిత విభాగాధిప‌తులు వారికి వ్యాక్సిన్ వేసుకోవ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిపి, వ్యాక్సిన్ వేసుకునేలా తెలియ‌జేయాల‌న్నారు. తిరుమ‌ల రిసెప్ష‌న్ విభాగానికి అవ‌స‌ర‌మైన సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని జెఈవోను కోరారు. సిబ్బందిపై పెండింగ్‌లో ఉన్న డిఏ కేసులు, కారుణ్య నియ‌మ‌కాల ద్వారా వ‌చ్చే సిబ్బందికి శిక్ష‌ణ త‌దిత‌ర వాటిపై జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి వివరించారు. టిటిడిలో అంత‌ర్గ‌తంగా జ‌రిగే ఉత్త‌ర ప్ర‌త్యుత‌రాలు పేప‌రుపై కాకుండా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌ర‌పాల‌న్నారు. ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ రోజున వారికి రావ‌ల‌సిన ప్ర‌యోజ‌నాలు, పెన్ష‌న్ త‌దిత‌ర వాటిని అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.ఈ స‌మావేశంలో జెఈవో  స‌దా భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఎఫ్ ఎ అండ్ సిఎవో   బాలాజి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Tirumala katejila modernization work should be done quickly – TTD EO Dr keesjavaharreddi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page