దళిత సాధికారిక పథకంను హర్షిస్తూ నకిరేకల్ నుండి హైదరాబాద్ కు పాదయాత్ర

0 8

దళిత సామాజిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నాడు మొదలైన పాదయాత్ర
పాదయాత్రను ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్గోండ  ముచ్చట్లు:
దళిత సమాజానికి ధైర్యానిచ్చిన దళిత భాందవుడు సీఎం కేసీఆర్  ప్రవేశ పెట్టిన దళితసాధికారిక పథకంను హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గంనుండి దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య గారు ప్రారంభించారు, నకిరేకల్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వరకు పాదయాత్రను నిర్వహించి, దళిత భాందవుడు కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తామని వారు ఎమ్మెల్యే చిరుమర్తితో తెలిపారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పాదయాత్రను ప్రారంభించిన దళిత సంఘాల నాయకులను ఆయన అభినందించారు, అట్టడుగున ఉన్న దళితులను తలెత్తుకుని బ్రతికేలా  ముఖ్యమంత్రి కేసీఆర్  దేశ చరిత్రలో గొప్ప అడుగు వేశారని తెలిపారు, దళిత సమాజాన్ని అభివృద్ధి దశలోకి నడిపేందుకు   ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోందని ఆయన తెలిపారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ని దళిత జాతి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని, మరో అంబేద్కర్ లా కేసీఆర్ కి దళిత సమాజం రుణపడి ఉంటుందని అన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

- Advertisement -

Tags:Padayatra from Nakirekal to Hyderabad rejoicing in the Dalit Empowerment Scheme

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page