నగరంలో మంకీ మ్యాన్  ఆగడాలు

0 7

విజయవాడ ముచ్చట్లు:

 

నగరంలో ‘మంకీ మ్యాన్’ హల్‌చల్ చేస్తున్నాడు. రాత్రయితే చాలు నల్ల ప్యాంట్, నల్ల షర్ట్, మంకీ క్యాప్‌ ధరించి ఇళ్లలో దూరి చాటుమాటున మహిళలను తడిమి చూస్తున్నాడు. ఏడాది కాలంగా ఇలాంటి ఆకతాయి పనులు చేస్తున్నా అతడిని పట్టుకోవడం పోలీసులకు సమస్యగా మారింది. అసలు ఎవరీ మంకీ మ్యాన్?.. మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు?.. ఈ పనులు చేస్తున్నది ఒక్కడా.. ఇంకెవరైనా ఉన్నారా? అన్నది అంతు చిక్కడం లేదు.విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో చీకటి పడిందంటే ఓ వ్యక్తి ఇళ్ళలోకి దూరి, కిటికీ చాటున, బాత్‌రూంల మాటున నక్కి మహిళలను చూస్తుంటాడు. అతడు ఎక్కువగా ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తుంటాడు. మధ్య వయస్కులు, యువతులు బాత్రూమ్‌లో స్నానం చేస్తునప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు దొంగచాటుగా చూస్తు పైశాచికానందం పొందుతున్నాడు. ఈ సైకో ఎక్కువగా విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప నగర్, అశోక్‌నగర్‌లో అతడి ఆగడాలు మితిమీరుతున్నాయి.

 

 

 

- Advertisement -

దీనిపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు అతడిని ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు.అతడు ఆగడాలకు పాల్పడిన సమయంలో గుర్తించిన మహిళలు కేకలు వేస్తుండగా సైకో తప్పించుకుని పారిపోతున్నాడు. స్థానికులు పట్టుకోవాలని చూసినా అతడు చిక్కడం లేదు. ఎవరు పట్టుకున్నా తప్పించుకునేందుకు ముందస్తు జాగ్రత్తగా ఒంటికి ఆయిల్ రాసుకుంటున్నాడు. అతడి ఆగడాలతో విసిగిపోయిన విజయవాడ ప్రజలు తమకు రక్షణ కల్పించాలంటూ ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కలిసి మొరపెట్టుకున్నాడు.అయితే పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఆ సైకో చిక్కకపోవడం విజయవాడ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదంతా చేస్తోంది ఆకతాయిలా.. దొంగలా.. ఇంకెవరైనానా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ‘మంకీ మ్యాన్‌‌‌‌‌’గా వ్యవహరిస్తున్న అతడిని త్వరలోనే పట్టుకుంటామని విజయవాడ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Monkey Man games in the city

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page