పల్లె, పట్టణ ప్రగతిలో నియోజకవర్గం అగ్రస్థానంలో ఉండాలి అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమీక్ష

0 6

జగిత్యాల  ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం రేపటి నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. నాలుగవ విడత పల్లె ప్రగతి,ఏడవ విడత హరితహారం, పట్టణ ప్రగతి ఇప్పటివరకు విజయవంతంగా నిర్వహించామని, మరో విడత హరితహారానికి సిద్ధమైన మనం సమన్వయంతో ఉండి రాష్ట్రంలోనే నియోజకవర్గం అగ్రగామిగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రతినిధులు, తాను పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పచ్చదనం పరిశుభ్రత కు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వర్షాకాలం ఆరంభమైనందున సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి పల్లె శుభ్రతను పాటించడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పిడి వినోద్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:The constituency should be at the forefront of rural and urban development
MLA Dr Sanjay Kumar review with officials

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page