మనోజ్ చుక్కలు చూపించాడు : సదా కామెంట్స్

0 10

హైదరాబాద్ ముచ్చట్లు:

 

గ్లామర్ ఇండస్ట్రీ అన్నాక జనం నోళ్ళలో పలు రకాలుగా నానడం కామన్. నటీనటులపై, ముఖ్యంగా హీరోయిన్స్ విషయమై కుప్పలు తెప్పలుగా గాసిప్స్ పుట్టుకొస్తుంటాయి. ఓ హీరోయిన్ మరో హీరోతో కాస్త క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేసినా లేదా వరుసపెట్టి రెండు మూడు సినిమాల్లో నటించినా వాళ్ళ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ రూమర్స్ వైరల్ చేస్తుంటారు. హీరోయిన్ సదా విషయంలో సరిగ్గా ఇదే జరిగిందట. ఈ విషయాలతో పాటు తన కెరీర్ ముచ్చట్లను తాజాగా ‘ఆలీతో సరదాగా’ వేదికపై పంచుకుంది సదా.తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘జయం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది సదా. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ పలు సౌత్ ఇండియన్ భాషల్లో ఫేమస్ హీరోయిన్ అయింది. విక్రమ్ హీరోగా శంకర్ రూపొందించిన ‘అపరిచితుడు’ సినిమా ఆమెను ఫుల్ పాపులర్ చేసేసింది. కాగా తాజా పోగ్రామ్‌లో కెరీర్ ఆరంభం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జరిగిన అన్ని విషయాలను షేర్ చేసుకున్న సదా.. మంచు వారబ్బాయి మంచు మనోజ్ రియల్ క్యారెక్టర్ బయటపెట్టింది.మంచు మనోజ్‌తో కలిసి ‘దొంగ దొంగది’ సినిమాలో నటించింది సదా. ఎప్పుడూ చలాకీగా ఉండే మంచు మనోజ్..

 

 

- Advertisement -

ఆ సినిమా షూటింగ్ సమయంలో సదాను ఏడిపించాడట. ఈ విషయాన్ని ఆలీ లేవనెత్తడంతో వెంటనే రియాక్ట్ అయింది సదా. అవును అప్పటిదాకా ర్యాగింగ్‌ అంటే ఎలా ఉంటుందో తెలియని నాకు మంచు మనోజ్ చుక్కలు చూపించాడు అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. సెట్స్‌పై అస్సలు ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదని ఆమె చెప్పింది.ఇక తమిళంలో మాధవన్‌తో ఏకంగా మూడు సినిమాలు చేయడం వల్ల ఆయనతో ఎఫైర్ ఉందని జోరుగా చర్చలు నడిచాయని చెప్పిన సదా.. సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి ఎంతో కామన్ కాబట్టి వాటిని అంతగా పట్టించుకోలేదంటూ ఓపెన్ అయింది. ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లి మ్యాటర్ కూడా తీసిన ఈ హీరోయిన్ మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా లేదంటే సింగిల్ గానే ఉంటానని చెప్పింది. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కచ్చితంగా వీగన్‌ అయి ఉండాలని సదా తెలిపింది.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Manoj showed the dots: Always comments

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page